Chandrababu: పెట్టుబడుల ఆకర్షణపై చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

CM Chandrababu has directed the officials to ensure that all information about the expansion of the companies reach him

  • దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయాలని అధికారులకు సూచన
  • కంపెనీల విస్తరణ ప్రణాళికలను తెలుసుకుని ముందుగానే సంప్రదించాలని యోచిస్తున్న సీఎం
  • వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, చాకచక్యంగా వ్యవహరించి రాష్ట్రంలోకి పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దేశంలో పెట్టుబడులతో ముడిపడిన సమగ్ర పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న కంపెనీల విస్తరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముంబై, ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించిన జాతీయస్థాయి వార్తా పత్రికలను ప్రతి రోజూ ఉదయం తన డ్యాష్‌బోర్డులో పెట్టాలని కోరారు.

పెద్ద కంపెనీల విస్తరణ ప్రణాళికల గురించి తెలుసుకొని ముందుగానే సంప్రదింపులు జరిపితే రాష్ట్రానికి పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అధికారులకు ఆయన ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ కార్పొరేట్, బిజినెస్‌, విద్యా సంస్థల పేర్లను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

కాగా ఏపీని పెట్టుబడులకు అనువైన ప్రదేశం అనే ముద్ర వేయాలని, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించ వచ్చునని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార యంత్రాంగం ప్రక్షాళన, పార్టీ సంబంధ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే పెట్టుబడులను ఆకర్షించడంపై ఆయన దృష్టిసారించారు.

  • Loading...

More Telugu News