Tadepalli: హమ్మయ్య.. తాడేపల్లి వాసులకు తీరిన ఐదేళ్ల దారి కష్టాలు!
- జగన్ నివాసం వెనక నుంచి ఎవరూ వెళ్లకుండా నిషేధం
- కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాల్లో రాకపోకల నిషేధం
- బారికేడ్లు తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో తాడేపల్లి ప్రజల ఐదేళ్ల ‘దారి’ కష్టాలకు మోక్షం లభించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువున ఉన్న మార్గాల్లో రాకపోకలు నిషేధించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అటువైపు వెళ్లాలనుకునే వారు అదనంగా ఒకటిన్నర కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. వారి ఇబ్బందులపై స్పందించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆయా మార్గాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించింది. గత రాత్రి నుంచే ఆ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి.