USA: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి

2 Killed In Shooting During Annual Concert In Texas To Mark End Of Slavery

  • శనివారం టెక్సాస్‌లోని ఓల్డ్ కన్సర్ పార్క్‌లో జూన్‌టీన్త్ వేడుకల్లో కాల్పుల కలకలం
  • రెండు గ్రూపుల మధ్య వివాదం కాల్పులకు దారి తీసిన వైనం
  • ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరి మృతి, 14 మందికి గాయాలు
  • బాధితులకు ఆసుపత్రిలో చికిత్స

అమెరికాలో బానిసత్వం ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరో 14 మంది గాయాల పాలయ్యారు. శనివారం రాత్రి టెక్సాస్‌లోని ఓల్డ్ సెట్లర్స్ పార్ట్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో ఈ ఘటన వెలుగు చూసింది. రెండు గ్రూపుల మధ్య గొడవలో ఓ ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. 

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మృతులు ఇద్దరూ గొడవపడ్డ విషయాన్ని పేర్కొన్నారు. కాల్పుకు తెగబడ్డ వ్యక్తి నల్లజాతీయుడని పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిపిన వారికి 5 వేల రివార్డును కూడా ప్రకటించారు. బానిసత్వం ముగింపును ప్రతి ఏటా జూన్‌టీన్త్ పేరిట అమెరికాలో వేడుక నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News