Vladimir Putin: ఉత్తర కొరియా పర్యటనకు వెళుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Putin will tour North Korea

  • జూన్ 18, 19 తేదీల్లో ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన
  • పుతిన్ పర్యటనను నిర్ధారించిన ఉత్తర కొరియా 
  • గతేడాది రష్యాలో పర్యటించిన కిమ్ జాంగ్ ఉన్

ప్రపంచ దేశాల నడుమ దాదాపు ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియాకు గట్టి మిత్రదేశం ఏదైనా ఉందంటే అది రష్యానే. ఉత్తర కొరియాకు కొంతమేర చైనా మద్దతు ఉన్నప్పటికీ... రష్యాతోనే ఉత్తర కొరియాకు బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ 2023 చివర్లో రష్యాలో పర్యటించడమే అందుకు నిదర్శనం. 

ఇప్పుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు వచ్చింది.  రేపు, ఎల్లుండి (జూన్ 18, 19) తేదీల్లో పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా నిర్ధారించింది. 

కొంతకాలంగా రష్యా... ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది. రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని సరఫరా చేస్తున్న ఉత్తర కొరియా... అందుకు ప్రతిగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతున్నట్టు పాశ్చాత్య మీడియా ఆరోపిస్తోంది. అయితే, ఉత్తర కొరియా ఈ కథనాలను ఖండిస్తోంది.

కాగా, ఉత్తర కొరియాలో ఓ రష్యా అధ్యక్షుడు పర్యటిస్తుండడం 24 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News