Addanki Dayakar: ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యాఖ్య... స్పందించిన అద్దంకి దయాకర్

Addanki Dayakar on EVMs
  • ఈవీఎంలతో కచ్చితమైన ఫలితాలు రావన్న ఎలాన్ మస్క్
  • ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయన్న అద్దంకి దయాకర్
  • టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని వ్యాఖ్య
టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌పై ఉన్నతస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈసీ పనితీరుపై కూడా ఉన్నతస్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈవీఎంలను నమ్మలేమని... అవి చాలా డేంజర్ అని... వాటితో కచ్చితమైన ఫలితాలైతే రావని ఎలాన్ మస్క్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందించారు.
Addanki Dayakar
EVM
Congress

More Telugu News