Raghu Rama Krishna Raju: ఈ నిధికి తొలి విరాళంగా నేను రూ.5 లక్షలు ఇచ్చాను: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju donates Rs 5 laks to Undi constituency development
  • టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన రఘురామ
  • ఉండి అసెంబ్లీ స్థానం నుంచి విజయం
  • జిల్లా కలెక్టర్ సహకారంతో డ్రైనేజి మెయింటెనెన్స్ నిధి ఏర్పాటు
  • ఎస్బీఐలో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్
రఘురామకృష్ణరాజు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన వెంటనే పని ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ కోసం తన వంతుగా భారీ విరాళం అందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. 

"ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారంతో ఎస్బీఐ బ్యాంకులో 'డ్రైనేజి నిర్వహణ మౌలిక సదుపాయాల నిధి-ఉండి' పేరుతో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తెరిపించాను. ఈ నిధికి తొలి విరాళంగా నేను రూ.5 లక్షలు ఇచ్చాను. 

ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నాను" అంటూ రఘురామ తన ట్వీట్ లో వివరించారు. ఈ మేరకు ఎస్బీఐ అకౌంట్ కన్ఫర్మేషన్ వివరాలను, తాను విరాళంగా ఇచ్చిన బ్యాంకు చెక్కును కూడా రఘురామ పంచుకున్నారు.
Raghu Rama Krishna Raju
Undi
Drainage Maintenance Infrastructure Fund
District Collector
SBI
TDP

More Telugu News