Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు ప్రచారంపై కూతురు సుస్మిత ఏమన్నారంటే..!

Sushmitha responds on RS seat to Chiranjeevi
  • తన వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మిత
  • ప్రచారం జరిగిన మాట వాస్తవమేనని వ్యాఖ్య
  • కానీ తాము ప్రస్తుతం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నామని వెల్లడి
చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశంపై మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత స్పందించారు. సుస్మిత 'పరువు' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. దీని ప్రచారంలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి రాజ్యసభ సీటు అంశంపై ప్రశ్నించారు.

సుస్మిత స్పందిస్తూ... తన పరిధిలో లేని అంశాల గురించి మాట్లాడుతున్నారన్నారు. అయితే ఈ ప్రచారం జరిగిన మాట వాస్తవమేనని... కానీ ప్రస్తుతం తాము సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ విజయాన్ని ఉద్దేశించి సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నట్లు చెప్పారు.

చిరంజీవితో సినిమా నిర్మించేందుకు చాలా ఆసక్తితో ఉన్నానని తెలిపారు. అయితే దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సినిమాల నిర్మాణాల విషయంలో తన సోదరుడు రామ్ చరణ్ విలువైన సలహాలు ఇస్తారని తెలిపారు.
Chiranjeevi
Sushmitha
Rajya Sabha

More Telugu News