Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal Custody In Liquor Policy Case Extended Till July 3
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పైన కొన్నిరోజులు బయట ఉన్నారు. తిరిగి ఈ నెల 2వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Arvind Kejriwal
New Delhi
Delhi Liquor Scam

More Telugu News