MSP: రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వరికి మద్దతు ధర పెంపు
- 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
- వరికి మద్దతు ధరను రూ.117 పెంచిన కేంద్రం
- పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడి
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న సహా పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధరను పెంచింది. తాజా పెరుగుదలతో క్వింటాల్ ధాన్యం ధర రూ.2,300కు చేరుకుంది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పెంచిన ధరలతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు.