Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Delhi court reserves order on Arvind Kejriwal bail plea
  • బెయిల్ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం
  • వాదనలు వినిపించిన ఈడీ, సీఎం తరఫు న్యాయవాదులు
  • నిన్ననే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన న్యాయస్థానం
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ, ముఖ్యమంత్రి తరఫు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి నియాబిందు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు గురువారం తెలిపారు.

మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని బుధవారం కోర్టు జులై 3 వరకు పొడిగించింది. అంతకుముందు జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీని పొడిగించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది.
Arvind Kejriwal
AAP
Delhi Liquor Scam

More Telugu News