Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary takes oath as pro tem speaker
  • ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి
  • రేపటి నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు 
  • గోరంట్లతో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించిన గవర్నర్
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.  

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశం కానుండడంతో, ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభా వ్యవహారాలను నడిపించనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక లాంఛనాలను ఆయన ప్రొటెం స్పీకర్ హోదాలో పర్యవేక్షించనున్నారు.
Gorantla Butchaiah Chowdary
Pro-tem Spaker
AP Assembly Session
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News