K Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించిన న్యాయస్థానం

Kavitha Judicial custody extended
  • కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచిన సీబీఐ
  • ఆమె కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
  • నాలుగు నెలలుగా జైల్లోనే కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై, తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి... నాలుగు నెలలుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు.
K Kavitha
CBI
ED
Delhi Liquor Scam

More Telugu News