Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఢీ కొట్టే చాన్స్ 72 శాతం

There is A 72 Percent Chance That An Asteroid May Hit Earth On This Exact Day
  • 2038 జులై 12న భూమిని తాకే అవకాశం ఉందన్న నాసా
  • ముప్పును తప్పించేందుకు ఇప్పటికైతే సంసిద్ధంగా లేమని వెల్లడి
  • గ్రహశకలం ఎంతుందనే విషయంలో స్పష్టత లేదని వివరణ
అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. అయితే, దీని పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదని, భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం 2038 జులై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్ ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు గత ఏప్రిల్ లో బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సెర్ సైజ్ నిర్వహించారు. సమీప భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పులేకున్నా.. గ్రహశకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సెర్ సైజ్ చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఈ నెల 20న నాసా విడుదల చేసింది. ఈ సమ్మరీని పరిశీలించిన జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు.. భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ ను గుర్తించారు.
Asteroid
May Hit Earth
72 Percent Chance
NASA
Space Technology

More Telugu News