Afghanistan: ఆసీస్ ను ఓడించాక బస్సులో 'చాంపియన్స్' సాంగ్ తో ఆఫ్ఘన్ జట్టు సంబరాలు... వీడియో ఇదిగో!

Afghanistan cricketers celebrates with Champions song in team bus after beating Aussies
  • టీ20 వరల్డ్ కప్ లో సంచలనం
  • ఆస్ట్రేలియాను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
  • 149 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆసీస్ 127 పరుగులకే ఢమాల్
  • అద్భుతంగా రాణించిన ఆఫ్ఘన్ బౌలర్లు, ఫీల్డర్లు
తనకంటే బలమైన జట్లను సైతం కంగుతినిపిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇవాళ టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు తన సత్తా రుచి చూపించింది. 

ఆఫ్ఘన్ జట్టు సాధించింది స్వల్ప స్కోరు (148/6) అయినా... ఆ స్కోరును అద్భుతంగా కాపాడుకుంటూ ఛేజింగ్ లో ఆసీస్ ను 127 పరుగులకే కుప్పకూల్చిన వైనం సూపర్బ్ అని చెప్పాలి. వారి బౌలర్లు అమోఘమైన రీతిలో బంతులు విసరగా, ఫీల్డర్లు నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ లు అందుకుని ఆసీస్ ఆటకట్టించారు. 

మ్యాచ్ ముగిశాక ఆఫ్ఘన్ ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్ కు  తిరిగి వెళుతూ బస్సులో సంబరాలు చేసుకున్నారు. వారి బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో (డీజే బ్రావో) గతంలో స్వయంగా ఆలపించిన చాంపియన్స్ సాంగ్ కు డ్యాన్సులు చేస్తూ, తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Afghanistan
Australia
Champions Song
Celebrations
DJ Bravo
Super-8
T20 World Cup 2024

More Telugu News