Nagarjuna: విషయం నా దృష్టికి వచ్చింది.. క్షమించండి: అక్కినేని నాగార్జున

Hero Nagarjuna apologized to the fan for the inconvenience
టాలీవుడ్ అగ్ర నటుడు, హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. సదరు అభిమానిని నిర్దయగా పక్కకు ఈడ్చి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నాగార్జున స్పందించారు. 

విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూదని విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నాను !!’’ అని నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Nagarjuna
Movie News
Tollywood
Akkineni Nagarjuna

More Telugu News