Mumbai: తండ్రి స్నాప్‌చాట్‌ను డౌన్లోడ్ చేసుకోనివ్వలేదని బాలిక ఆత్మహత్య
- మహారాష్ట్రలోని థానెలో శుక్రవారం ఘటన
- స్నాప్‌చాట్ వద్దన్న తండ్రిపై బాలిక తీవ్ర ఆగ్రహం
- తన బెడ్రూంలో ఓరాత్రి వేళ ఉరివేసుకుని ఆత్మహత్య
- మరుసటి రోజు జరిగిన దారుణాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు
స్నాప్‌చాట్ యాప్‌ను తన ఫోన్లో డౌన్లోడ్ చేయొద్దని తండ్రి అన్నాడని క్షణికావేశానికి లోనైన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, థానెలోని డోంబీవిలీ ప్రాంతానికి చెందిన బాలిక శుక్రవారం స్నాప్‌చాట్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, తండ్రి మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేశాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక ఆ రాత్రి తన గదిలోకి వెళ్లిపోయింది. చివరకు గదిలోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.