KTR: నీట్ పీజీ పరీక్ష వాయిదాపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్న కేటీఆర్
- ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందని వ్యాఖ్య
- ఎన్డీయే అంటే నేషనల్ డిజాస్టర్ అలయెన్స్ అని కొత్త అర్థం
కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నీట్ పీజీ పరీక్ష వాయిదాపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందన్నారు.
నీట్ పేపర్ లీకైనా... కేంద్రం జులై 6 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తోందన్నారు. ఆ తర్వాత ఎలాంటి కారణాలు చూపకుండా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిందన్నారు. కేంద్రం అసమర్థతే దీనికి కారణమని ఆరోపించారు. ఎన్డీయే అంటే నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అని కొత్త అర్థం చెప్పారు. అన్నింటికీ కారణం వారే అన్నారు.
జూన్ 4న నీట్ యూజీ పరీక్ష లీక్ అయిందని... జూన్ 19న పరీక్షను క్యాన్సిల్ చేశారని తేదీలతో పాటు పేర్కొన్నారు. జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పోస్ట్ పోన్ చేశారని పేర్కొన్నారు. జూన్ 22న నీట్ పీజీటీని చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేసినట్లు ట్వీట్లో తెలిపారు.