Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు

Home minister Anitha met state deputy chief minister Pawan Kalyan
  • నేడు వరుస సమావేశాలతో పవన్ బిజీ
  • విజయవాడలో పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన హోంమంత్రి అనిత
  • డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • పవన్ ను కలిసిన విజయవాడ సీపీ, డీసీపీ
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన అనిత... పవన్ కల్యాణ్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. 

ఇక, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్ డీ రామకృష్ణ, డీసీపీ ఆదిరాజ్ రాణా కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. వారు పవన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

పవన్ కల్యాణ్ ఈ ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీకి హాజరైన పవన్ కల్యాణ్... అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.
Pawan Kalyan
Vangalapudi Anitha
Vijayawada
TDP-JanaSena-BJP Alliance

More Telugu News