Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియా చాన్స్... మంత్రి నారా లోకేశ్ స్పందన

Nara Lokesh appreciates Nitish Kumar who gets maiden national call
  • జింబాబ్వేతో టీ20 సిరీస్ కు టీమిండియా ఎంపిక
  • తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి
  • ఏపీ బిడ్డ అంటూ సంతోషం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్ 
తెలుగుతేజం, డాషింగ్ బ్యాట్స్ మన్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నితీశ్ కుమార్ కు కూడా స్థానం కల్పించారు. ఇటీవల ఐపీఎల్ లో నితీశ్ కుమార్ మెరుపులు టీమిండియా సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి. 

కాగా, నితీశ్ కుమార్ కు టీమిండియా అవకాశం లభించడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

"మనవాడు నితీశ్ కుమార్ కు తొలిసారిగా టీమిండియా నుంచి పిలుపు రావడం పట్ల సంతోషిస్తున్నాను. దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా క్రికెట్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఏపీ బిడ్డ నితీశ్ కుమార్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అద్భుతంగా ఆడినందుకు తగిన కానుక లభించింది. జింబాబ్వేతో టీ20 సిరీస్ లో నితీశ్ కుమార్ రాణించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్" అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
Nitish Kumar Reddy
Team India
Zimbabwe
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News