Jeevan Reddy: జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు: భట్టివిక్రమార్క

Bhattivikramarka says Jeevan Reddy is key leader for congress
  • జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను  అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామన్న భట్టి
  • కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు కృషి చేశారని కితాబు
  • పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందని వెల్లడి
జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు తమ పార్టీ సిద్ధంగా లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్ఠానం దృష్టికి తెస్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందన్నారు. పార్టీకి దిశా నిర్దేశనం చేసేందుకు జీవన్ రెడ్డిలాంటి వారు అవసరమన్నారు.
Jeevan Reddy
Congress
Mallu Bhatti Vikramarka

More Telugu News