Renu Desai: మీకూ ఓ కుటుంబం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి.. నా కుమార్తె కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడతాయి జాగ్రత్త: రేణుదేశాయ్

Actress Renu Desai Warns Social Media Users Who Post Memes About Her
  • భార్య లెజినోవా, పిల్లలతో కలిసి ఇటీవల ఫొటో దిగిన పవన్
  • దానిని మీమ్స్ చేస్తూ రేణుదేశాయ్‌ను అవమానించేలా పోస్టులు
  • వాటిని చూసి తన కుమార్తె కన్నీళ్లు పెట్టుకుందని రేణు ఆవేదన
  • ఈ తల్లి శాపం తప్పనిసరిగా తగిలి తీరుతుందన్న రేణుదేశాయ్
‘‘మీకూ ఓ కుటుంబం ఉంది. అందులో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. నా కుమార్తె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి జాగ్రత్త’’ అని రేణుదేశాయ్ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తన భార్య లెజినోవా, పిల్లలు అకీరానందన్, ఆద్యతో సరదగా దిగిన ఫొటో వైరల్ అయింది. 

ఈ ఫొటోను ఉపయోగించి రేణుదేశాయ్‌ను అవమానించేలా కొందరు మీమ్స్ రూపొందించారు. వీటిపై స్పందించి రేణు.. కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫొటోను తాను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని పేర్కొంటూ మీమ్స్, జోక్స్ వేశారని పేర్కొన్నారు. 

‘‘మీకూ ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. మీలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యమేస్తోంది. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు తప్పనిసరిగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి వందలసార్లు ఆలోచించాను. నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టు చేస్తున్నాను’’ అని రేణుదేశాయ్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
Renu Desai
Pawan Kalyan
Memes
Tollywood

More Telugu News