Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్

CBI formally arrests Delhi CM Arvind Kejriwal in excise policy case
  • ఈ ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన సీబీఐ
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్
  • అరెస్ట్ నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరణ
  • మార్చి 21 నుంచి తీహార్ జైలులో కేజ్రీవాల్
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బుధవారం అరెస్టయ్యారు. రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీచేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. 

మనీలాండరింగ్ కేసులో ఊరటనిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేయగా, హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇప్పుడా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందంటూ మార్చి 21న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఉదయం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన సీబీఐ కస్టడీ కోరింది. స్పందించిన కోర్టు.. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఇప్పటి వరకు కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని లేవనెత్తింది. ఈ నేపథ్యంలో సీబీఐ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ అరెస్ట్‌కు కోర్టు సమ్మతించింది.
Arvind Kejriwal
Delhi Liquor Scam
CBI
Rouse Avenue Court

More Telugu News