EDCET: ఏపీలో ఎడ్ సెట్ ఫలితాల విడుదల
- జూన్ 8న ఏపీలో ఎడ్ సెట్ నిర్వహణ
- బీఎడ్, స్పెషల్ బీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష
- ఎడ్ సెట్ కు మొత్తం 9,365 మంది హాజరు
- జూన్ 15న ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల
ఏపీలో ఎడ్ సెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బీఎడ్, స్పెషల్ బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8న ఏపీ ఎడ్ సెట్ నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షను ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తరఫున ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావడంతో, అధికారులు నేడు ఫలితాలు విడుదల చేశారు.
ఈ ఏడాది ఎడ్ సెట్ పరీక్షకు మొత్తం 9,365 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 15న ప్రిలిమనరీ ఆన్సర్ కీ విడుదల చేశారు. జూన్ 18 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. ఎడ్ సెట్ ఫలితాలను ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు.
https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx
ఏపీలో ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై ప్రకటన చేయడం నిరుద్యోగుల్లో ఉత్సాహం కలిగిస్తోంది.