T20 World Cup 2024: టీమిండియా-ఇంగ్లండ్ వరల్డ్ కప్ సెమీస్ కు వర్షం అడ్డంకి.. టాస్ ఆలస్యం

Rain delays toss between Team India and England semifinal match
  • టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీస్
  • టీమిండియా × ఇంగ్లండ్
  • గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో మ్యాచ్
  • ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఈ సెమీస్ మ్యాచ్ కు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే, మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా సాధ్యపడలేదు. 

టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ చేరింది. నేడు, రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టు ఫైనల్లో సఫారీలతో అమీతుమీకి సిద్ధమవుతుంది. 

అయితే, గయానాలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. వర్షం పడుతూ, ఆగుతూ ఉండడంతో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం వర్షం ఆగడంతో స్టేడియం సిబ్బంది మైదానాన్ని ఆటకు అనువుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు.
T20 World Cup 2024
Semifinal
Team India
England
Guyana

More Telugu News