RS Praveen Kumar: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఆ నిబంధన సడలించాలి: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar demand over BSC Nursing study

  • పక్క రాష్ట్రాల్లో బైపీసీ తర్వాత నేరుగా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఇస్తున్నారని వెల్లడి
  • మన వద్ద నీట్ లేదా ఎంసెట్ పరీక్ష పాస్ కావాలనే నిబంధన తెచ్చారని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనలు పెట్టారని విమర్శలు

ప్రజాప్రభుత్వమని చెబుతున్న తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే కచ్చితంగా ఎంసెట్ లేదా నీట్ పరీక్ష పాస్ కావాలనే నిబంధన తెచ్చారని, దీనిని సడలించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కర్ణాటక తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో... ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో పాసైన విద్యార్థులకు... నేరుగా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్‌కు అవకాశం కల్పిస్తున్నారని వెల్లడించారు.

కానీ రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనను సడలించి... ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్స్ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. వైద్య ఆరోగ్యమంత్రి దామోదర నర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకుని నర్సింగ్ కోర్సులలో చేరాలనుకుంటున్న వేలాదిమంది విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News