Ayodhya Ram Mandir: మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న వీడియో.. బీజేపీని చెడుగుడు ఆడుతున్న నెటిజన్లు

After 10 years of BJP govt in Ayodhya video went viral
  • వర్షాలకు దాదాపు మునిగిన అయోధ్య
  • నీట మునిగిన వీధులు.. భక్తుల ఇక్కట్లు
  • అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి
  • దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు
  • బీజేపీ పదేళ్ల పాలన ఇదేనంటూ నెటిజన్ల ఫైర్
ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్య దాదాపు మునిగింది. మోకాళ్లలోతు నీటితో రోడ్లు, వీధులు కలిసిపోయి ఏది ఎక్కడ ఉందో గుర్తుపట్టలేనంతగా చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. 

స్థానికులు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఈ తిప్పలు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే ఉండదని వాపోతున్నారు. రోజుకు 2 వేల నుంచి 2,500 మంది వస్తుంటారని, వారు ఎదుర్కునే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావని చెబుతున్నారు.

వీధులు పూర్తి బురదమయంగా ఉండడంతో బైకులు, ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొంటున్నారు. అంతేకాకుండా భవన నిర్మాణాల ప్లాన్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ అయోధ్యను దారుణంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీధుల్లో మోకాళ్ల లోతులో చేరిన నీరుతో రామమందిర పరిసర ప్రదేశాలు బురదమయంగా, అడుగు కూడా వేయలేనంతగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాముడు తమ వాడని, అయోధ్యను తాము కట్టామని గొప్పగా చెప్పుకునే బీజేపీ పదేళ్ల పాలనకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు.
Ayodhya Ram Mandir
Ayodhya
Uttar Pradesh
BJP

More Telugu News