Mann Ki Baat: ఏపీలో రేపు 10 వేల కేంద్రాల్లో 'మన్ కీ బాత్': పురందేశ్వరి

PM Modi Mann Ki Baat will be organised in 10 thousand centres in AP
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో 'మన్ కీ బాత్' కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. 'శక్తి' కేంద్రాలను జిల్లా కార్యవర్గాలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఒక్క 'శక్తి' కేంద్రంలో రేపు 'మన్ కీ బాత్' నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' పేరిట ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసంగించడం ఆనవాయతీగా వస్తోంది. 

ఎన్డీయే 3.0 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రేపు తొలిసారిగా 'మన్ కీ బాత్' నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. 

ఇక, రాజమండ్రిలో జులై 8న బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని పురందేశ్వరి తెలిపారు.
Mann Ki Baat
Narendra Modi
Daggubati Purandeswari
BJP
Andhra Pradesh

More Telugu News