Team India: టీ20 వరల్డ్ కప్ ఫైనల్... టాస్ మనదే

Team India won the toss and choose batting first
  • టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా అమీతుమీ
  • బ్రిడ్జిటౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 
ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్లుగా నిలవాలని తహతహలాడుతున్న టీమిండియా... నేటి ఫైనల్ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. అటు, తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్న దక్షిణాఫ్రికా జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవు.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

దక్షిణాఫ్రికా...
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టాన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, ఆన్రిచ్ నోర్కియా, తబ్రైజ్ షంసీ.
Team India
Toss
Batting
South Africa
Final
T20 World Cup 2024

More Telugu News