BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Bitter experience to BRS MLA
  • కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్
  • బీఆర్ఎస్ హయాంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణ
  • మాగంటి గోపీనాథ్‌తో కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం
  • దీంతో చెక్కుల పంపిణీ చేయకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పోరేటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. 

ఈ రోజు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేయాలని ఆయన భావించారు. అయితే, బీఆర్ఎస్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులను దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ కార్పోరేటర్లు బాబా ఫసియుద్దీన్, సీఎన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు... ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోపీనాథ్‌తో వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో చెక్కులు పంపిణీ చేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు.
BRS
Maganti Gopinath
Hyderabad
Congress

More Telugu News