MS Dhoni: ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

MS Dhoni First Reaction After India T20 World Cup Win
  • సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో భారత్ విజయం
  • తన హార్ట్‌రేట్ ఒక్కసారిగా పెరిగిపోయిందన్న ధోనీ
  • భారత్ ఇప్పుడు ‘ఫోర్ స్టార్’ సాధించిందన్న సచిన్
‘నా హార్ట్‌రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది’.. భారత జట్టు టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత ధోనీ ఫస్ట్ రియాక్షన్ ఇది. ఫైనల్ సందర్భంగా ప్రశాంతంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఏం చేయాలో అది చేయడం కలిసొచ్చిందని, ప్రపంచకప్‌ను తెచ్చినందుకు స్వదేశంలోని భారతీయులతోపాటు విదేశాల్లోని భారతీయులందరి తరపున కతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు పేర్కొన్నాడు. ‘అమూల్యమైన బర్త్ డే గిఫ్ట్‌కు ధన్యవాదాలు' అని ధోనీ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. 

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లతో భారత్ ఇప్పుడు ‘ఫోర్ స్టార్’ సాధించిందని పేర్కొన్నాడు. టీమిండియా జెర్సీపై చేరే ఒక్కో స్టార్ దేశంలోని చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతుందని, వారి కలలను చేరుకోవడానికి మరింత దగ్గర చేస్తుందని పేర్కొన్నాడు.
MS Dhoni
Sachin Tendulkar
T20 World Cup 2024 Final
Rohit Sharma

More Telugu News