T20 World Cup: మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన క్యాచ్.. వీడియో ఇదిగో!

Suryakumar Yadavs Stunning Catch That Clinched T20 World Cup 2024 Title For India
  • బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ స్టన్నింగ్ క్యాచ్
  • బ్యాలెన్స్ నిలుపుకోలేక మరోసారి బంతిని గాల్లోకి విసిరి తిరిగి అందుకున్న వైనం
  • డేవిడ్ మిల్లర్ ఔటవడంతో భారత్ వైపు మొగ్గిన మ్యాచ్
ఫైనల్ మ్యాచ్.. ఫైనల్ ఓవర్ థ్రిల్లర్ లో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ భారత జట్టుకు ప్రపంచ కప్ ను తెచ్చిపెట్టింది. విజయానికి పదహారు పరుగుల దూరంలో ఉన్న సౌతాఫ్రికా తన ఆశలన్నీ డేవిడ్ మిల్లర్ పైనే పెట్టుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపగా.. అది నేరుగా బౌండరీ లైన్ అవతల పడేలా కనిపించింది. అయితే, బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ అద్భుతమైన ఫీల్డింగ్ తో బంతిని ఒడిసిపట్టాడు. బౌండరీ లైన్ అవతల పడాల్సిన బంతి కాస్తా సూర్యకుమార్ చేతుల్లో పడింది.

అయితే, వేగంగా పరుగెత్తుకు వచ్చిన సూర్యకుమార్ బ్యాలన్స్ ఆపుకోలేక పోయాడు. బౌండరీ లైన్ క్రాస్ చేశాడు. చివరి క్షణంలో బంతిని మరోసారి గాలిలోకి విసిరిన సూర్యకుమార్.. బౌండరీ లైన్ అవతల కాలు వేసి తిరిగి ఇవతలికి వస్తూ బంతిని అందుకున్నాడు. దీంతో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ కు వెళ్లాడు. మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. దీంతో సూర్యకుమార్ బంతిని కాదు ప్రపంచ కప్ ను పట్టుకున్నాడంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
T20 World Cup
Final match
Suryakumar Yadav
Stunning catch
Viral Videos

More Telugu News