TET: రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం రేపు (జూన్ 1) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జులై 2 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. https://cse.ap.gov.in/ వెబ్ పోర్టల్ లో టెట్ కు సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
టెట్ పై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ, అదనపు సమాచారం కోసం కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో టెట్ నిర్వహించగా... 58.56 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ సమయంలో టెట్ కు 2.35 లక్షల మంది హాజరయ్యారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ ను ఇవాళ రద్దు చేస్తూ జీవో కూడా జారీ చేశారు.