Jaspreet Bumrah: వెరైటీగా బుమ్రాకు ప్లకార్డును కానుకగా ఇచ్చిన సిరాజ్

Siraj gifts a placard to Bumrah after winning world cup final
  • వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం
  • తిరుగులేని కచ్చితత్వంతో బౌలింగ్ చేసిన బుమ్రా
  • రెండు వికెట్లు తీయడంతో పాటు, కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి
నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లెట్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లను వణికించాడు. 

ఓపెనర్ రీజా హెండ్రిక్స్, ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ లను బుమ్రా అవుట్ చేసిన తీరు అదరహో అనేలా ఉంది. ఆ ఇద్దరినీ బుమ్రా అద్భుతమైన స్వింగ్ తో బోల్తా కొట్టించాడు. అంతేకాదు, ఓ దశలో దక్షిణాఫ్రికా సింగిల్ రన్ తీయడానికి చాలా కష్టపడిందంటే అందుకు కారణం బుమ్రా కచ్చితత్వంతో కూడిన బౌలింగే. 

మొత్తమ్మీద బుమ్రా కూడా టీమిండియా వరల్డ్ కప్ విజయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ నుంచి బుమ్రాకు సూపర్ కానుక అందింది. అది ఒక ప్లకార్డు. దానిపై ఇలా రాసి ఉంది. "భూమ్మీద మాత్రమే కాదు, గాలిలో, నీటిలో కూడా అత్యుత్తమ బౌలర్ బుమ్రా" అనే అర్థం వచ్చేలా ఆ ప్లకార్డు ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్లకార్డు ఫొటో వైరల్ అవుతోంది.
Jaspreet Bumrah
Mohammed Siraj
Placard
Team India
South Africa
Final
T20 World Cup 2024

More Telugu News