Revanth Reddy: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy meeting with Radhakrishnan
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ
  • భేటీ అనంతరం లంచ్ చేయనున్న సీఎం, గవర్నర్
  • రేవంత్ రెడ్డి వెంట సలహాదారు వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై ఆయన గవర్నర్‌తో చర్చించారు. భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం, మంత్రివర్గ విస్తరణ అంశంపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు గంట నుంచి వారి మధ్య చర్చ సాగుతోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి లంచ్ చేయనున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
Revanth Reddy
Congress
BJP
Governor

More Telugu News