MLC Ramachandra Reddy: కడప జిల్లా పాఠశాలలో ప్రమాదం... ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు

Police files case against MLC Ramachandra Reddy
కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా హైస్కూల్ లో 8వ తరగతి క్లాస్ రూంలో శ్లాబ్ పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థులు గాయపడడం తెలిసిందే. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. ఈ స్కూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించినదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో, పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. సాయిబాబా పాఠశాల చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరగతి గది పైకప్పు కూలిందని కేసు నమోదు చేశారు.
MLC Ramachandra Reddy
Police Case
School
Incident
Akkayapalli
Kadapa District

More Telugu News