Kakinada: 'అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రెచ్చిపోయిన ద్వారంపూడి' అంటూ వీడియో ట్వీట్ చేసిన టీడీపీ

Former MLA Dwarampudi Chandrashekar Fires On Kakinada Officials
  • కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపూడి రెచ్చిపోయాడంటూ ట్వీట్
  • బినామీ అనుచరుడి భవనం కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం
  • రౌడీ ద్వారంపూడిని పోలీసులు ఎత్తి అవతల పడేశారని టీడీపీ ట్వీట్
కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోయాడంటూ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియో షేర్ చేసింది. కాకినాడలో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనం కడుతున్నారని ఆరోపించింది. దీనిపై కార్పొరేషన్ అధికారులు ద్వారంపూడి బినామీ అనుచరుడికి నోటీసులు జారీ చేశారని పేర్కొంది. ఈ నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు వచ్చారని తెలిపింది.

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి అధికారులను అడ్డుకునేందుకు రౌడీ ద్వారంపూడి ప్రయత్నించాడని పేర్కొంది. తమ విధులకు అడ్డు వస్తున్న రౌడీ ద్వారంపూడిని పోలీసులు ఎత్తి అవతల పడేసి, రూల్స్ ప్రకారం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారని టీడీపీ తన ట్వీట్ లో పేర్కొంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన రౌడీ ద్వారంపూడిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్వీట్ లో పేర్కొంది.
Kakinada
Dwarampudi
YSRCP
Building Demolition
Kakinada corporation
Viral Videos

More Telugu News