New Laws: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల ప్రకారం కేసు

First Case Under New Criminal Laws On MLA Padi Kaushik Reddy
  • భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే
  • జిల్లా పరిషత్ సమావేశాల్లో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి
  • అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే
  • కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, జిల్లా పరిషత్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. అధికారులు, తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడ్డారు. ‘నువ్వెంత నీ కథ ఎంత.. ఎక్కువ రోజులు ఉండవ్.. పోరా బై పో’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైనా తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు.
New Laws
MLA Kaushik Reddy
BRS Mla
BNS
Huzurabad
First Case

More Telugu News