YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక సాక్షి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

The health condition of the key witness in the YS Vivekananda Reddy murder case is alarming
  • వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో కీల‌క సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగ‌న్న
  • గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న రంగ‌న్న‌
  • ప్ర‌స్తుతం పులివెందుల ఏరియా ఆసుప‌త్రిలో రంగ‌న్న‌కు వైద్యం
కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో కీల‌క సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగ‌న్న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో రంగ‌న్న‌ను పులివెందుల ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ‌ పరీక్షించిన వైద్యులు అతడిని కడప రిమ్స్ కు రిఫ‌ర్ చేయ‌డంతో అక్క‌డి త‌ర‌లించ‌డం జ‌రిగింది.

కాగా, 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల నివాసంలో వైఎస్‌ వివేకా దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించి జైలుకు పంపారు. వారిలో ప్రస్తుతం కొందరు బెయిల్‌పై బయటకు వ‌చ్చారు. ఈ కేసులో నిందుతుల్లో ఒకరైన అవినాశ్‌ రెడ్డి కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి గెలుపొందారు. మరో నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారారు.
YS Vivekananda Reddy
YS Viveka Murder Case
Andhra Pradesh

More Telugu News