Team India: భారత్ మాతాకీ జై నినాదాలతో మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ ఘన స్వాగతం

Massive crowd gathers to cheer for the talented Mohammad Siraj
  • శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానుల బ్రహ్మరథం
  • ప్రపంచకప్ గెలిచినందుకు సంతోషంగా ఉందన్న మహమ్మద్ సిరాజ్
  • ఇది హైదరాబాద్‌కు గర్వించదగ్గ క్షణాలు అని వ్యాఖ్య
టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ... ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రానున్న రోజుల్లో తాను మరింతగా కష్టపడి భారత జట్టుకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానన్నాడు. ఛాంపియన్‌గా నిలిచిన అనుభూతి వర్ణించడానికి మాటలు రావట్లేదన్నాడు. ఇది హైదరాబాద్‌కు గర్వించదగ్గ క్షణాలు అన్నాడు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చిన సిరాజ్‌కు మెహిదీపట్నంలో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతనిని వాహనంలో ఊరేగించారు. సరోజిని కంటి ఆసుపత్రి నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్డు షో నిర్వహించారు. అభివాదం చేస్తూ సిరాజ్ ముందుకు కదిలాడు.
Team India
Mohammad Siraj
Cricket

More Telugu News