Joe Biden: తప్పంతా నాదే.. ట్రంప్‌తో బహిరంగ చర్చలో వైఫల్యంపై బైడెన్

Nobodys Fault But Mine Biden Firefights Shaky Debate Performance
  • ట్రంప్ ‌తో తొలి డిబేట్‌లో బైడెన్ ఘోర వైఫల్యం
  • బడలిక కారణంగా సరిగ్గా చర్చించ లేకపోయానన్న బైడెన్ 
  • వైఫల్యానికి పూర్తిగా తనదే బాధ్యత అని కామెంట్
అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన టీవీ చర్చలో తాను తడబడటం, విఫలమవడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ పరిస్థితికి తానే కారణమని, వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అంతకుముందు, విస్కాన్సిన్ లోని మాడిసన్ నగరంలో జరిగిన డెమాక్రటిక్ పార్టీ ర్యాలీలో బైడెన్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో ముచ్చటించారు.  

ఆ రాత్రి టీవీ చర్చలో తాను విఫలమయ్యానని బైడెన్ అంగీకరించారు. అయితే, దీని వెనక తీవ్రమైన అనారోగ్య కారణమేమీ లేదని స్పష్టం చేశారు. అప్పటికే బాగా అలసిపోయినా, మనసు మొరాయిస్తున్నా వినకుండా చర్చలో పాల్గొని విఫలమయ్యానని అన్నారు. ట్రంప్‌తో చర్చకు ముందు ఫ్రాన్స్ పర్యటన నుంచి వచ్చిన బైడెన్ క్యాంప్ డేవిడ్‌లో రెస్టు తీసుకున్న విషయాన్ని యాంకర్ ప్రస్తావించారు. ఈ విశ్రాంతి సరిపోలేదా? అని ప్రశ్నించారు. అప్పటికే తాను బాగా బడలికతో ఉన్నానని, అసలేమాత్రం ఉత్సాహంగా లేనని బైడెన్ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో కొవిడ్ వ్యాధి లేదని వచ్చినా తీవ్రమైన జలుబు ఉందని చెప్పారు. చర్చకు సంబంధించి టీవీ ఫుటేజీని తాను ఇప్పటివరకూ చూడలేదని కూడా బైడెన్ చెప్పారు. కానీ, అది నిరాశపరిచేదిగా ఉందన్న విషయం తనకు తెలుసని అన్నారు.
Joe Biden
Donald Trump
USA
Debate

More Telugu News