Raj Tarun: రాజ్ తరుణ్ వ్యవహారంలో కీలక పరిణామం... లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Police issues notice to Lavanya in Raj Tarun related issue
  • రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య
  • ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఆధారాలు ఇవ్వాలన్న పోలీసులు
  • నోటీసులకు, ఫోన్ కాల్ కు స్పందించని లావణ్య
హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నిన్న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడని... ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తనవద్దకు రాలేదని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. 

అయితే, ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నోటీసుల్లో కోరారు. అయితే ఆమె ఈ నోటీసులకు స్పందించలేదు. అంతేకాదు, ఫోన్ కాల్ కు కూడా ఆమె అందబాటులోకి రాలేదు. 

కాగా, లావణ్య చేసిన ఫిర్యాదు సరైన ఫార్మాట్ లో లేదని పోలీసులు చెబుతున్నారు. తారీఖు, సమయం, ప్లేస్... ఇలా ఏదీ లేకుండా ఫిర్యాదు చేసినట్టు వివరించారు. సాయంత్రం లోపు లావణ్య నుంచి స్పందన రాకపోతే... కోర్టు అనుమతి తీసుకుని అది తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు.
Raj Tarun
Lavanya
Notice
Police
Hyderabad
Tollywood

More Telugu News