CMs meeting: కాసేపట్లో సీఎంల సమావేశం.. రెండు రాష్ట్రాల తరపున హాజరవుతున్నది వీరే!
- సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ
- చంద్రబాబుతో పాటు హాజరుకానున్న మరో ముగ్గురు మంత్రులు
- రేవంత్ తో పాటు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు
విభజన సమస్యలను పరిష్కరించుకోవడమే ఏకైక అజెండాగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సాయంత్రం 6 గంటలకు వీరి సమావేశం జరగబోతోంది. ఎన్నో విభజన సమస్యలు గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే... మెజార్టీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఇరువురు సీఎంల సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరుకానున్నారు.
తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే సీఎంల సమావేశానికి సంబంధించిన అజెండా ఖరారయింది.