Sachin Tendulkar: వింబుల్డన్ లో సందడి చేసిన భారత క్రికెట్ దేవుడు... ఫొటోలు ఇవిగో!

Sachin Tendulkar attends Wimbledon Tennis Grand Slam tourney
  • వింబుల్డన్ టోర్నీలో నేడు జ్వెరెవ్, కామెరాన్ నోరీ మ్యాచ్
  • సతీసమేతంగా హాజరైన సచిన్ టెండూల్కర్
  • ఇదే మ్యాచ్ కు విచ్చేసిన ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జో రూట్, బట్లర్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నారు. సచిన్ ఇవాళ వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి హాజరయ్యారు. అలెగ్జాండర్ జ్వెరెవ్, కామెరాన్ నోరీ మధ్య జరిగిన మ్యాచ్ లో సచిన్ తళుక్కుమన్నారు. తన అర్ధాంగి అంజలితో కలిసి ఈ మ్యాచ్ ను వీక్షించారు. సచిన్ రాకతో వింబుల్డన్ సెంటర్ కోర్టులో కోలాహలం నెలకొంది. సచిన్ వెనుక వరుసలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్, బట్లర్ కూర్చున్నారు. కామెరాన్ నోరీ ఇంగ్లండ్ ఆటగాడు కావడంతో ఇంగ్లీష్ క్రికెటర్లు ఈ మ్యాచ్ కు విచ్చేశారు. కాగా, తాను వింబుల్డన్ టోర్నీకి హాజరైన ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Sachin Tendulkar
Wimbledon
London
England

More Telugu News