Gujarat: సూరత్ లో కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం.. ఏడుగురు మృతి

7 Killed In Surat Building Collapse Bodies Pulled Out Of Debris Overnight
  • శిథిలాల నుంచి 15 మంది క్షతగాత్రులను కాపాడిన అధికారులు
  • ఏడు మృతదేహాల వెలికితీత.. కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ఇప్పటికే శిథిలావస్థలో భవనం.. భారీ వర్షాలకు నానడంతో ప్రమాదం
గుజరాత్ లోని సూరత్ లో ఉన్న సచిన్ పాలి గ్రామంలో శనివారం ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన ఆ అపార్ట్ మెంట్ అనూహ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అందుకే అందులో 30 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. దీనికితోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది.

ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారు ఇళ్లలో నిద్రిస్తున్నారు. సూరత్ లోని వస్ర్త పరిశ్రమలో పనిచేసే యూపీ, బీహార్ కు చెందిన కార్మికులు భవనంలో నివసిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సందీప్ దేశాయ్ తెలిపారు.

ప్రమాదవార్త తెలియగానే పోలీసులు, ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డీఆర్ ఎఫ్ సహాయ సిబ్బంది భవన శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. శనివారం రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయానికి ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ ఏఎన్ ఐ వార్తాసంస్థకు తెలిపారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని.. అయితే శిథిలాల కింద ఇంకెవరూ చిక్కుకోలేదని భావిస్తున్నట్లు చెప్పారు. 



Gujarat
Surat
Building
Collapse
Six Storey
7 dead
Injured rescued

More Telugu News