Drugs: మణికొండలోని కేవ్ పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకం.. నార్కోటిక్స్ బృందం దాడి

TGNAB searches in Cave Pub in Hyderabad Manikonda
  • డీజే ఆపరేటర్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న పబ్ నిర్వాహకులు
  • 50 మందిలో 24 మందికి పాజిటివ్
  • అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు
రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టీజీ న్యాబ్, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా 50 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వారిని విచారించగా డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. దీంతో దీని వెనకున్న అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Drugs
Cave Pub
Manikonda
Hyderabad
TGNAB

More Telugu News