Prabhas: విజయం దక్కదన్నారు.. దక్కింది.. పెళ్లి కూడా అంతే: ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి

Prabhas Aunt Shyamala Devi Responds About Prabhas Marriage
  • ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పెద్దమ్మ శ్యామలాదేవి
  • ప్రభాస్‌కు పెళ్లి చేయాలని తమకూ ఉందన్న వైనం
  • సమయం కోసం ఎదురుచూస్తున్నామన్న శ్యామలాదేవి
  • పై నుంచి కృష్ణంరాజు చూసుకుంటారని వ్యాఖ్య
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కల్కి ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా వసూళ్ల రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. మరోవైపు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ అయిన ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు మరోమారు హాట్ టాపిక్ అయ్యాయి. 

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ‘డార్లింగ్’ పెళ్లిపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని చాలామంది అన్నారని, కానీ వారి అంచనాలు తారుమారయ్యాయని కల్కి సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. 

పెళ్లి చేయాలని తమకూ ఉందని అయితే, అందుకు తగిన సమయం రావాలని అన్నారు. వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నామని, పైనుంచి కృష్టంరాజు చూసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆశించినవన్నీ జరిగాయని, పెళ్లి కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Prabhas
Kalki 2898AD
Prabhas Marriage
Shyamala Devi

More Telugu News