Venkaiah Naidu: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై వెంకయ్యనాయుడు స్పందన

Venkaiah Naidu opines on meeting between Chandrababu and Revanth Reddy
హైదరాబాదులో నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం శుభపరిణామం అని అభివర్ణించారు. ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
Venkaiah Naidu
Chandrababu
Revanth Reddy
Andhra Pradesh
Telangana

More Telugu News