TTD: టీటీడీలో ప్రక్షాళన... కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ

Vigilance officers orgainses search in TTD administration Building

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్న సీఎం చంద్రబాబు
  • టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై దృష్టి సారించింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. చెప్పినట్టుగానే... టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి. టీటీడీలో విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. 

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు చేపట్టారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. 

విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. బీజేపీ నేత నవీన్ పలు వివరాలను, తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందించారు.

  • Loading...

More Telugu News