Kuldeep Yadav: 'బాలీవుడ్ నటితో కుల్దీప్ యాదవ్ పెళ్లి' అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన క్రికెటర్

Kuldeep Yadav has opened up on his personal life and says not marrying any bollywood heroine
  • తాను నటిని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఊహాగానాలకు చెక్ పెట్టిన స్పిన్నర్
  • త్వరలోనే తన వివాహం ఉంటుందని వెల్లడి
  • కాబోయే భార్య తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమన్న కుల్దీప్
టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన భారత జట్టులో భాగస్వామి అయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన పెళ్లికి సంబంధించిన ఊహాగానాలపై పెదవి విప్పాడు. బాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వెలువడుతున్న ఊహాగానాలను కొట్టిపారేశాడు. అయితే తన పెళ్లికి సంబంధించి త్వరలో శుభవార్త వస్తుందని ప్రకటించాడు. తన జీవితంలోకి రాబోయేది నటి కాదని, ఆమె కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తనకు చాలా ముఖ్యమని కుల్దీప్ అన్నాడు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

టీ20 వరల్డ్ కప్ 2024 విజేత జట్టుకు ముంబైలో ఊరేగింపు, సన్మానం తర్వాత ఒక రోజు ముంబైలో విశ్రాంతి తీసుకొని స్వస్థలమైన కాన్పూర్‌కు కుల్దీప్ యాదవ్ చేరుకున్నాడు. కాన్పూర్‌లో అతడికి ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు అతడికి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి, డబ్బు వాయిద్యాలతో కుల్దీప్‌కు స్వాగతం పలికారు

ఈ విధంగా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని, చాలా గొప్పగా అనిపిస్తోందని అన్నాడు. ప్రపంచ కప్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా కంటే భారత్ కప్పు గెలవడం చాలా ముఖ్యమని, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవడం సంతోషంగా ఉందని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఇంటికి చేరుకున్న కుల్దీప్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ విజేత మెడల్‌ను తన తల్లి మెడలో వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
Kuldeep Yadav
T20 World Cup 2024
Team India
Cricket

More Telugu News