Challa Venkatrami Reddy: బీఆర్ఎస్ కు మరో షాక్.. రేవంత్ ను కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

BRS MLC Challa Venkatrami Reddy meets Revanth Reddy
  • ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడిన 13 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ చల్లా
  • ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి... కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

తాజాగా, బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.
Challa Venkatrami Reddy
BRS
Revanth Reddy
Congress
KCR

More Telugu News